ఏపీలో ఇవాళ ఒక్క రోజే 13,400 కొత్త కేసులు

ఏపీలో ఇవాళ ఒక్క రోజే 13,400 కొత్త కేసులు
  • ఎట్టకేలకు తగ్గుముఖం పడుతున్న కొత్త కేసులు
  • కొనసాగుతున్న మరణాల ఉధృతి..
  • గడచిన 24 గంటల్లో 95 కరోనా మరణాలు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు ఎట్టకేలకు తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా నమోదవుతున్న కేసుల వివరాలను పరిశీలిస్తే..ఉధృతికి కళ్లెం పడినట్లే కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో 83 వేల 232 మందికి పరీక్షలు చేయగా 13 వేల 400 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మరో వైపు కరోనా  మరణాల ఉధృతి కొనసాగుతోంది. వందకు పైగా కేసులు నమోదవుతున్న నేపధ్యంలో గడచిన 24 గంటల్లో 95 కరోనా మరణాలు నమోదయ్యాయి. 
జిల్లాల వారీగా చూస్తే కరోనా మరణాల్లో చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలో 14 మంది కరోనా  నుంచి కోలుకోలేక మృతి చెందగా ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో  9మంది చొప్పున, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో 8 మంది చొప్పున, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఐదుగురు చొపున, గుంటూరు, కడప జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. మరో వైపు గడచిన 24 గంటల్లో 21 వేల 133 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.