
న్యూఢిల్లీ: ఇవాళ్టి నుంచి దేశంలో కరోనా టీకా ఉత్సవ్ మొదలైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న టీకా ఉత్సవ్ గురించి మోడీ మాట్లాడారు. దీన్ని కరోనా మీద చేస్తున్న రెండో అతిపెద్ద యుద్ధంగా మోడీ అభివర్ణించారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మొదలవుతున్న టీకా ఉత్సవ్.. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 4) వరకు కొనసాగుతుందని తెలిపారు. వైరస్ ను తరిమికొట్టడానికి నాలుగు ప్రధాన అంశాలను పౌరులు గుర్తుంచుకోవాలని చెప్పారు. నిరక్షరాస్యులు, వృద్ధులకు టీకా తీసుకోవడంలో సాయం చేయాలన్నారు. టీకా ఆవశ్యకత, అది తీసుకునే విధానం గురించి వివరించాలని కోరారు. కరోనా ట్రీట్మెంట్ గురించి అవగాహన లేని వారికి, వనరుల లేమితో ఉన్న వారికీ వాటి గురించి తెలియజెప్పాలని విజ్ఞప్తి చేశారు. అందరూ మాస్కులు కట్టుకోవాలని, మాస్కులు ధరించని వారికి కట్టుకోవాలని కోరాలన్నారు. పాజిటివ్ గా తేలిన వ్యక్తులకు సపరేట్ ప్లేస్ లో , సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు.