కరోనా ఆంక్షలతో ఆర్థికంగా నష్టపోతాం

కరోనా ఆంక్షలతో ఆర్థికంగా నష్టపోతాం

UK నుంచి వచ్చినవారిలోనే ఎక్కువ ఒమిక్రాన్ కేసులు కనిపిస్తున్నాయన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.కరోనా ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని.. అందుకని ప్రతిచోటా ఆంక్షలు విధించలేమన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.  రైళ్లు, విమాన ప్రయాణికుల రాకపోకలకు సెంటర్ గా ఉన్నందున కోల్‌కతాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు.
 
గంగాసాగర్ మేళా గురించి మాత్రమే కేంద్రం వర్రీ అవుతోందని... నిజానికి కేంద్రం ఆందోళన చెందాల్సింది కుంభమేళా గురించి అన్నారు మమత. గంగాసాగర్ మేళాకు రాకుండా తాము ఎవరినీ ఆపలేమన్నారు. అయితే వచ్చేవారు కచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తామన్నారు మమత.

 

మరిన్ని వార్తల కోసం...

 

ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు