వాషింగ్టన్: యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో చేస్తున్న కరోనా టెస్టుల గురించి పలు విషయాలు వెల్లడించారు. శనివారం ఓక్లహామాలోని టల్సాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టెస్టింగ్ అనేది కత్తికి ఇరు వైపులా పదును లాంటిది. ఎక్కువగా టెస్టులు చేసినప్పుడు అంతే ఎక్కువగా కేసులు బయటపడతాయి. అందుకే అఫీషియల్స్‌కు టెస్టింగ్స్‌ను తగ్గించమని చెప్పా’ అని ట్రంప్ పేర్కొన్నారు. యూఎస్‌లో కరోనా కేసుల సంఖ్య 2.25 మిలియన్లకుపైనే ఉంది. వైరస్ బారిన పడి 1,12,000 మంది చనిపోయారు. దీంతో మహమ్మారిని ఎదుర్కోవడానికి టెస్టింగ్స్ సంఖ్యను పెంచాల్సిందిగా ట్రంప్‌కు ఎక్స్‌పర్ట్స్ సిఫార్సు చేశారు. అయతే టెస్టింగ్స్ సంఖ్యను తగ్గించాలని ట్రంప్ తాజాగా చెప్పడం పలు వివాదాలకు దారి తీసేలా ఉంది. నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ దేశాన్ని రీఓపెన్ చేసి, ఎకానమీని తిరిగి పరుగెత్తించాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నట్లు కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
