వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోదా?.. రెండోది తప్పనిసరా?

వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోదా?.. రెండోది తప్పనిసరా?

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఎన్ని డోసులు తీసుకోవాలనే దానిపై వస్తున్న రూమర్ల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టీకా వేయించుకునే పౌరులు తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ రెండు డోసులు ఎందుకు తీసుకోవాలనే దాని గురించి ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టతను ఇచ్చారు. ఫస్ట్ కొవిడ్ వ్యాక్సిన్‌ డోసును ప్రైమ్ డోస్‌గా పిలుస్తామని, ఇది మన రోగ నిరోధక వ్యవస్థలో యాంటీబాడీస్‌ను పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు.  ఇలా తయారైన యాంటీబాడీస్ ఎక్కువ రోజులు ఉండవన్నారు. సెకండ్ డోస్‌‌ను బూస్టర్ డోస్‌గా పిలుస్తామని, ఈ డోస్ ఇమ్యూన్ సిస్టమ్‌‌లో ఎక్కువ సంఖ్యలో యాంటీ బాడీస్‌‌ను ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకోవాలని కోరారు.