కరోనా నెగెటివ్ రిపోర్ట్/వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకుంటే అలిపిరి నుంచే వెనక్కి

కరోనా నెగెటివ్ రిపోర్ట్/వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకుంటే అలిపిరి నుంచే వెనక్కి

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సినేష‌న్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ ప్రకటించింది. వ్యాక్సినేషన్ పూర్తి కాని వాళ్లు దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే దర్శనానికి రావాలని సూచించింది. ఈ విషయంపై గతంలోనే ప్రకటన చేసినప్పటికీ భక్తులు ఈ నిబంధనను పట్టించుకోకుండా వచ్చేస్తున్నారని, అందుకే మరోసారి ప్రజలకు తెలియజేస్తున్నామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ప‌లువురు భ‌క్తులు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్, వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఏదీ లేకుండా వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి వెనక్కి పంపాల్సి వస్తోందని, దీంతో భక్తులు ఇబ్బందికి గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. దయచేసి ఈ రిపోర్ట్స్ లేకుండా ఎవరూ తిరుమల రావొద్దని సూచించారు.

కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయని, దీంతో ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ రిపోర్టును అలిపిరి చెక్ పాయింట్ వద్ద ప్రతి భక్తుడు తప్పనిసరిగా చూపించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.  అవి లేని భక్తులను కొండపైకి అనుమతించడం లేదని గుర్తించాల్సిందిగా కోరారు.

మరిన్ని వార్తల కోసం..

ఉద్యోగుల కోసం బీజేపీ ఉద్యమం

హైదరాబాదీ పిల్లాడికి ప్రధాన మంత్రి బాల పురస్కారం

తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్