ప్రెగ్నెన్సీ టైమ్లో వ్యాక్సినేషన్.. పుట్టబోయే బిడ్డకు మేలు

ప్రెగ్నెన్సీ టైమ్లో వ్యాక్సినేషన్.. పుట్టబోయే బిడ్డకు మేలు

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషనే ఆయుధమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సహా అనేక పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపుగా అన్ని వయసుల వారికీ వ్యాక్సినేషన్ జరుగుతోంది. అయితే గర్భవతుల వ్యాక్సినేషన్ పై కొంత మందికి అనుమానాలు, భయాలు ఉన్నాయి. ప్రభుత్వాలు, పరిశోధన సంస్థలు ప్రెగ్నెంట్లను కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. అవగాహన కూడా కల్పిస్తున్నాయి. తాజాగా గర్భవతుల వ్యాక్సినేషన్ పై మరో పరిశోధన సంస్థ తమ అధ్యయన ఫలితాలను వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న గర్భవతులు, వారికి పుట్టిన పిల్లలపై యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తో పాటు పలు పిల్లల ఆస్పత్రులకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి పరిశోధనలు చేశారు. ప్రెగ్నెన్సీ సమయంలో కరోనా టీకా వేసుకుంటే వారికి పుట్టే పిల్లలకు కొవిడ్ నుంచి రక్షణ దొరుకుతుందని తేలింది. పుట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గర్భంలో ఉండగా తల్లి వేయించుకున్న టీకా ద్వారా వారికి కొంత కాలం పాటు రక్షణ లభిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

80 శాతం వరకు రక్షణ

ప్రెగ్నెన్సీ సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న మహిళలకు పుట్టిన పిల్లలు కరోనా బారినపడినా.. 61 శాతం మందిలో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అదే ఈ వ్యాక్సినేషన్ డెలివరీకి 14 రోజుల ముందే తల్లి వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే ఆ టీకా రక్షణ 80 శాతం వరకు పెరిగినట్లు గుర్తించామన్నారు. అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన తొలి వారాల్లోనే టీకా వేయించుకుంటే మాత్రం పుట్టబోయే పిల్లల్లో 32 శాతం మాత్రమే ఎఫెక్టివ్ గా పని చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం తాము తల్లీబిడ్డలను కొవిడ్ బారినపడకుండా కాపాడడమే తమ లక్ష్యమని, ఇందుకోసం ప్రెగ్నెంట్ మహిళలను వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని సీడీసీ సైంటిస్ట్ డానా డెల్మాన్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

మోడీకి మరో ఛాన్స్ ఇస్తే.. మళ్లీ ఉమ్మడి ఏపీని చూస్తం

చైనా కంపెనీకి కేంద్రం షాక్

గాడిదపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ఊరేగింపు