చైనా కంపెనీకి ఐటీ శాఖ షాక్

చైనా కంపెనీకి ఐటీ శాఖ షాక్

చైనీస్ టెలికాం జెయింట్ హువావేకు ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తోంది. పన్ను ఎగవేతకు సంబంధించి విచారణలో భాగంగా ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులోని హువావే ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కంపెనీకి చెందిన పలు ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, దేశ, విదేశీ ట్రాన్సాక్షన్లకు సంబంధించి రికార్డులను పరిశీలించిన అధికారులు వాటిలో కొన్నింటిని సీజ్ చేశారు. హువావే మాత్రం భారత నియమాలకు కట్టుబడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. 

పన్ను ఎగవేతకు సంబంధించి హువావేపై ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం హువావేను 5జీ సర్వీస్ ట్రయల్స్ నుంచి దూరంగా ఉంచింది.  ఇదిలా ఉంటే గతేడాది ఐటీ శాఖ చైనాకు చెందిన షావోమీ, ఒప్పో కంపెనీల్లోనూ సోదాలు నిర్వహించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ ఆయా కంపెనీలకు రూ.6,500 కోట్ల ఫైన్ విధించింది. 

For more news...

 

గాడిదపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ఊరేగింపు

టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతోనే రాష్ట్రం అప్పులపాలు