కోవిడ్ టీకా ధర రూ.250.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం

కోవిడ్ టీకా ధర రూ.250.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం

న్యూఢిల్లీ:  కోవిడ్ టీకా ధరను కేంద్రం ఖరారు చేసింది. టీకా ధర రూ.150.. వేసినందుకు సర్వీస్ చార్జి కింద రూ.100 కలిపి మొత్తం రూ.250గా నిర్ణయించింది. ఇంతకు మించి ప్రైవేటుగా ఎవరూ తీసుకోరాదని స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ.. దొంగచాటుగా వేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్న విషయం తెలిసిందే. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు, చివరకు ఆర్ఎంపీలు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం స్పందించింది. ప్రైవేట్ లో ఒక్కో టీకా డోస్ ను రూ.250 కి అందించాలని, అందులో 100 సర్వీస్ ఛార్జ్ కాగా, 150 రూపాయలుగా టీకా ఖరీదుగా ఖరారు చేసింది. అయితే ఇదంతా ప్రైవేటు మరియు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఉచితంగా వాక్సినేషన్ యధాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్థానికంగా ఉన్న ప్రైవేట్ వాక్సినేషన్ కేంద్రాలకు టీకా ధరలను తెలియజేయాలని కేంద్రం సూచించింది. తెలంగాణలో మొత్తం 1200 కేంద్రాల్లో 60 ఏళ్లు పై బడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తుండగా.. అందులో 200 కేంద్రాలు ప్రైవేట్ కి చెందినవే ఉన్నాయి.

 

For More News..

మోడీ కేరళ, అస్సాం వెళ్తారు.. రైతుల దగ్గరకు మాత్రం వెళ్లరు

కొడుకు పుట్టిన ఆనందంలో డ్యూటీ కోసం వేల కిలోమీటర్లు వెళ్లి..

కాణిపాకం టెంపుల్‌కు 7కోట్లు విరాళమిచ్చిన అజ్ఞాత భక్తుడు

క్లాస్ రూమ్‌లో లేడీ టీచర్ పై కత్తితో దాడి