అక్టోబర్‌ నాటికి పిల్లలకు వ్యాక్సిన్!

అక్టోబర్‌ నాటికి పిల్లలకు వ్యాక్సిన్!

న్యూఢిల్లీ: వచ్చే అక్టోబర్ నాటికి పిల్లలకు టీకాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌‌దీప్ గులేరియా అన్నారు. పిల్లలకు కరోనా వచ్చినా తేలికపాటి లక్షణాలు ఉంటాయని, అయితే అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ‘పిల్లలకు ఇచ్చే టీకాలపై ట్రయల్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సెప్టెంబర్ నాటికి అప్‌డేట్ రావొచ్చని భావిస్తున్నాం. అప్పటికి అప్రూవల్స్ కూడా లభిస్తే అక్టోబర్ నుంచి పిల్లలకు టీకా ఇచ్చే ప్రక్రియ మొదవుతుంది. ఈ విషయంలో ఫైజర్ కంపెనీ ఇప్పటికే అప్రూవల్ తీసుకుంది. మన దేశంలో ఫైజర్ అందుబాటులోకి రాగానే పిల్లలకు ఆ వ్యాక్సిన్‌ను అందిస్తాం. భారత్ బయోటెక్‌తోపాటు మిగిలిన కంపెనీలు కూడా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను వేగవంతం చేశాయి. అయితే ట్రయల్స్‌కు పిల్లల పేరెంట్స్ సహకరిస్తేనే ఈ దిశగా ముందుకెళ్లగలం’ అని గులేరియా పేర్కొన్నారు.