కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు

కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు

కోవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప ఆఫ్ ఇమ్యునైజేషన్(NTAIG) కీలక ప్రతిపాదనలు చేసింది. కోవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 8 నుంచి 16 వారాల మధ్య రెండో డోసును అందించొచ్చని ప్రతిపాదించింది. అంతకు ముందు రెండు డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలుగా ఉంది. అయితే చైనా, హాంకాంగ్..సహా.. ఇతర దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో NTAIG కీలక సిఫార్సులను చేసింది. అయితే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ పై మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు.

కొత్త టీమ్ తో కాంగ్రెస్ కు బలం పెరిగింది

విగ్రహ ఏర్పాటులో వివాదం.. బోధన్ లో హై టెన్షన్