ఆవులు, బర్రెలపై జోకులు ఏంటి

ఆవులు, బర్రెలపై జోకులు ఏంటి

వారణాసి: ఆవుల గురించి మాట్లాడితే దేశంలో కొంతమంది వ్యక్తులు అదో పాపంగా భావిస్తున్నారని, అయితే ఆవు తమకు అమ్మలాంటిదని, ఎంతో పవిత్రమైనదిగా గౌరవిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఉత్తరప్రదేశ్‌‌లోని తన నియోజకవర్గమైన వారణాసిలో రూ.2,095 కోట్ల విలువ చేసే 27 డెవలప్‌‌మెంట్‌‌ ప్రాజెక్టు పనులకు మోడీ శంకుస్థాపన చేసి సభలో మాట్లాడారు. దేశంలో డైయిరీ సెక్టార్‌‌‌‌ను బలోపేతం చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. అయితే ఆవు గురించి మాట్లాడితే కొంత మంది అదో నేరంగా భావిస్తున్నారని, ఆవులు, బర్రెలపై జోకులు వేస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశంలోని 8 కోట్ల కుటుంబాలు డైయిరీ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయన్న సంగతిని వారు మర్చిపోతున్నారన్నారు. సమాజ్‌‌వాద్‌‌ పార్టీ మాఫియావాద్‌‌, పరివార్‌‌‌‌వాద్‌‌ అన్న మోడీ.. తమ ప్రభుత్వం సబ్‌‌కా సాథ్‌‌, సబ్‌‌కా వికాస్‌‌కు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పాల ఉత్పత్తి 45 శాతం పెరిగిందన్నారు. దేశంలోనే ఉత్తరప్రదేశ్‌‌ అధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రమే కాకుండా డైయిరీ రంగాన్ని విస్తరిస్తోందని పేర్కొన్నారు. 1.7 లక్షల మందికిపైగా పాల ఉత్పత్తిదారులకు వారి బ్యాంకు అకౌంట్లలో దాదాపు రూ.35 కోట్ల బోనస్‌‌ను జమ చేశారు. 

కరోనాపై యుద్ధం అయిపోలే: ఒమిక్రాన్ పై మోడీ 
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున అందరూ అలర్ట్ గా ఉండాలని ప్రధాని మోడీ చెప్పారు. కరోనాపై యుద్ధం ఇంకా అయిపోలేదని, కొవిడ్ రూల్స్ తప్పకుండా పాటించాలన్నారు. గురువారం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఉన్నతాధికారులు, నిపుణులతో ప్రధాని అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న, కేసులు పెరుగుతున్న, ఆస్పత్రుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉన్న రాష్ట్రాలకు సహాయం కోసం స్పెషల్ టీమ్ లను పంపాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనావేయాలని అధికారులను ఆదేశించారు.