సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అభిషేక్​మహంతి

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అభిషేక్​మహంతి

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంటలో ఈనెల 17న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను సీపీ అభిషేక్​మహంతి పరిశీలించారు.  డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న సభా ప్రాంగణం వేదికతోపాటు ప్రజలు కూర్చోవడానికి ఏర్పాటు చేసే సభాస్థలిని, నాయిని చెరువు ప్రాంతంలో హెలీప్యాడ్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. 

అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సీపీ వెంట ఏసీపీ జీవన్ రెడ్డి, సీఐ రమేశ్‌‌‌‌‌‌‌‌, ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు.