తెలంగాణ సంసృతికి ప్రతీక నుమాయిష్ : సీపీ అంజనీకుమార్

తెలంగాణ సంసృతికి ప్రతీక నుమాయిష్ : సీపీ అంజనీకుమార్

నుమాయిష్ ఎగ్జిబిషన్ తెలంగాణా సాంసృతిక, సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు సీపీ అంజనీ కుమార్. మీడియాతో మాట్లాడిన ఆయన… కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లభించే వస్తువులు ఇక్కడ దొరుకుతాయని గుర్తుచేశారు. జనవరి 2నుంచి నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ 45రోజులపాటు కొనసాగుతుందని సీపీ చెప్పారు.  గత సంవత్సరం నుమాయిష్ లో అగ్నిప్రమాదం జరగడంతో ఈసారి మరింత కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ నూతన కమిటీ కూడా పలు జాగ్రత్తలు తీసుకుందని అన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రతి 30 మీటర్లకు ఫైర్ హైడ్రాన్ట్స్ , ఫైర్ కంట్రోల్ వెహికిల్స్ తిరిగేందుకు రోడ్ల నిర్మాణం , 1 లక్ష 50 వేల లీటర్ల నీటి నిలువ ఉండే రెండు వాటర్ సంపులను, 9 ఎమర్జెన్సీ ఏక్సిట్ మార్గాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ నెల 25 నుండి గ్రౌండ్స్ లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచామని చెప్పారు సీపీ.