స్టూడెంట్స్ చెడుకు దూరంగా ఉండాలి: సీపీ అంజనీ కుమార్

స్టూడెంట్స్ చెడుకు దూరంగా ఉండాలి: సీపీ అంజనీ కుమార్

భారతదేశంలో ఉన్న డెమెక్రసీ ప్రపంచంలో మరెక్కడా లేదని అన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. శనివారం ఉస్మానియా యునివర్సిటిలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం జరిగింది. ఇందులో సీపీ అంజనీ కుమార్, డీసీపీ రమేష్, ఓయూ రిజిస్టర్, ఓయూ స్టుడెంట్స్ పాల్గొన్నరు.

అంజనీ కుమార్ మాట్లాడుతూ… దేశంలోనే ఉస్మానియా యునివర్సిటీకి ఉన్న బిల్డింగ్ ఎక్కడా లేదన్నారు.  విద్యార్థులతో మాట్లాడినపుడు తనకు ఎక్కడాలేని ఉత్సాహం  వస్తదని చెప్పారు సీపీ. ప్రతీ సిటిజన్ ఒక పోలీస్… ప్రతీ పోలీస్ ఒక సిటిజన్ అని చెప్పారు.  ప్రతీ ఒక్కరు పాజిటివ్ గా ఉండాలని…ప్రతి వ్యక్తి లో మార్పు రావాలని కోరారు. స్టూడెంట్స్ చెడు కు దూరంగా ఉండి మంచి లక్షణాలు అలవర్చుకోవాలని చెప్పారు. హైదరాబాద్ 95 లక్షల మంది ఉన్నారు. క్రైమ్ రేటు 82 ఉందని…పట్నంలో 1200 వందల పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయని చెప్పారు.