హెల్ప్ సెంటర్ ద్వారా కరోనా పేషెంట్ల వివరాలు తెలుసుకోవాలి

హెల్ప్ సెంటర్ ద్వారా కరోనా పేషెంట్ల వివరాలు తెలుసుకోవాలి

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోన బాధితుల  కుటుంబ సభ్యులు, సహాయకులకు అనుమతి లేదన్నారు హైదరాబాద్ CP అంజనీ కుమార్. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోన హెల్ప్ సెంటర్ ను ప్రారంభించారు సీపీ అంజనీకుమార్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారామ్. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ.. పేషెంట్లకు సంబంధించిన సమాచారం హెల్ప్ సెంటర్ ద్వారా తెకుసుకోవాలని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో కరోన పేషెంట్స్ ఏ ప్లోర్ లో ఉన్నారు.. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అన్ని వివరాలు హెల్ప్ సెంటర్ వారు వివరిస్తారని చెప్పారు. 


కరోన పేపెంట్లకు డాక్టర్ లు బాగా సేవలు చేస్తున్నారని తెలిపారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారామ్. పేపెంట్ల కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆస్పత్రికి రావద్దని సూచించారు. గతంలో పేషెంట్స్ కు సహయకులుగా వచ్చిన వారు కూడా కరోన బారినపడి చనిపోయారని చెప్పారు. త్వరలోనే కరోనా పేషెంట్లకు సంబంధించి ఓ యాప్ ను విడుదల చేస్తామన్నారు. వీరికి సంబంధించిన అన్ని వివరాలు యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. హెల్ప్ సెంటర్ ద్వారా గాంధీ ఆస్పత్రిలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి..అందులో ఎన్ని కాలీ గా ఉన్నాయని తెలుసుకునే అవకాశముందన్నారు.