ఎన్నికల నిర్వహణపై..సిటీ పోలీసుల యాక్షన్ ప్లాన్

ఎన్నికల నిర్వహణపై..సిటీ పోలీసుల యాక్షన్ ప్లాన్
  • సమీక్ష నిర్వహించిన  సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాబోయే ఎన్నికల నేపథ్యంలో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. వచ్చే 4 నెలల పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్లానింగ్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా సిటీ సీపీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో సోమవారం బంజారాహిల్స్​ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​లో సమీక్షా సమావేశం జరిగింది. అడిషనల్ కమిషనర్లు విక్రమ్‌‌‌‌‌‌‌‌ సింగ్, విశ్వప్రసాద్ సహా జాయింట్ సీపీలు, డీసీపీలు పాల్గొన్నారు. 

అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల మ్యాపింగ్, సెన్సిటివ్ పోలింగ్‌‌‌‌‌‌‌‌ బూత్‌‌‌‌‌‌‌‌ల గుర్తింపు, ఫ్లయింగ్‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్, స్ట్రైకింగ్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ మొదలైన ఏర్పాట్ల గురించి చర్చించారు. గత ఎన్నికల టైమ్​లో నేరాలకు పాల్పడ్డ వారిని గుర్తించి బైండోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంపై సీపీ ఆనంద్ పలు సూచనలు చేశారు. నోడల్ పోలీస్ అధికారులందరూ కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌తో పనిచేయాలని ఆదేశించారు.