హైదరాబాద్‌‌‌‌ ట్రాఫిక్ సమస్యలపై యాక్షన్ ప్లాన్

హైదరాబాద్‌‌‌‌ ట్రాఫిక్ సమస్యలపై యాక్షన్ ప్లాన్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సిటీలో ట్రాఫిక్‌‌‌‌ ఇబ్బందులు నివారించేందుకు సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ ట్రాఫిక్ యాక్షన్‌‌‌‌ ప్లాన్ రూపొందించనున్నారు.  పెరిగిపోతున్న వెహికల్స్ సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  శనివారం ట్రాఫిక్ పోలీసులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. ట్రాఫిక్ చీఫ్ సుధీర్​బాబుతో కలిసి యూ టర్న్స్‌‌‌‌, లేన్స్‌‌‌‌, మీడియం క్లోజర్‌‌‌‌‌‌‌‌పై ఆరా తీశారు.  

రిమూవబుల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ అబ్‌‌‌‌స్ట్రక్టివ్‌‌‌‌ అండ్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌(రోప్‌‌‌‌) అమలు గురించి వివరాలు సేకరించారు. స్పెషల్‌‌‌‌ డ్రైవ్స్ చేపట్టాలన్నారు.  ఆర్టీసీ, స్కూల్స్‌‌‌‌, ఆటో యూనియన్లతో కలిసి రోడ్‌‌‌‌ సేఫ్టీపై అవగాహన పెంచాలన్నారు.  ట్రాఫిక్ ఫ్రీ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌, రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీ ఆనంద్ ఆదేశించారు.