Beauty Tips : అందమైన ముఖం.. నిగనిగలాడే అందం కోసం టొమాటో ప్యాక్స్.. ఇంట్లోనే ట్రై చేయొచ్చు..!

Beauty Tips : అందమైన ముఖం.. నిగనిగలాడే అందం కోసం టొమాటో ప్యాక్స్.. ఇంట్లోనే ట్రై చేయొచ్చు..!

ముఖంపై గ్లో రావాలంటే కాస్ట్​ లీ  క్రీములే వాడనవసరం లేదు. జస్ట్ కిచెన్ లో ఉండే టొమాటో చాలు... ముఖాన్ని అందంగా, మృదువుగా మారుస్తుంది. 

ఎప్పుడూ శ్రద్ద పెడితేనే ఫేస్ ఎట్రాక్టివ్ గా ఉంటుంది. కానీ పార్లల్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నా బ్యాన్ పెరిగిపోతుంది. దీంతో ఫేస్ డల్ గా తయారవుతుంది. అయితే కాస్త టైం కేటాయిస్తే డల్ గా ఉన్న ముఖాన్ని  గ్లో ఫేస్ గా మార్చుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడూ దొరికే టొమాటో ప్యాక్స్ తో ముఖాన్ని అందంగా. మార్చుకోవచ్చు. టొమాటోతో ఫేస్ ప్యాక్ లు కామనే. కానీ దాంతో ఈ సారి మరికొన్ని మిక్స్ చేసి చూడండి. వారంలోనే రిజల్ట్ కనిపిస్తుంది.

టొమాటో జ్యూస్ ప్యాక్..

టొమాటో జ్యూస్ ఒక్కటే ఫేస్ కు అప్లై చేస్తే  గ్లో అంతగా రాదు. కాని  ఆ జూస్ లో  కొన్ని పాలు, కొంచెం నిమ్మకాయ రసం వేయండి. ఈ ప్యాక్ ను ఫేస్​ కు అప్లై  చేసి అరగంట ఉంచాలి.  తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడిగితే ముఖంపై కొత్త గో కనిపిస్తుంది.

టొమాటో, శెనగపిండి ప్యాక్...

శెనగపిండి అన్నది మనం నలుగులో వాడుతుంటాం. అయితే ఈ సారి టొమాటాతో కలిపి ఫేస్ పై పెట్టండి. దీనికి కాస్త పెరుగును కూడా యాడ్ చేస్తే ఇంకా బెటర్ ఎందుకంటే ఈ మూడు చర్మంపై బాగా పనిచేస్తాయి. పెరుగులోని లాక్టిక్ యాసిస్, టొమాటోలో ఉండే సిట్రిక్, మాలిక్ యాసిడ్​ లు  స్క్రీన్ పై ఉన్న ట్యాస్ ను ఇట్టే పోగొడతాయి. 

Also read:-రోజుకు ఎన్ని గుడ్లు తినాలి.. ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యం

కీర, టొమాటో ప్యాక్..

మనకు సలాడ్ లో కనిపించే కీర ... టొమాటోలను తినడంతో పాటు.. ఈ సారి కొంచెం ముఖానికి కూడా అప్లై చేసి చూడండి. ఫేస్ లో అదిరిపోయే రేంజ్ కనిపిస్తుంది. టొమాటో, కీర రసాలను మిక్స్ చేసి ఫేస్ కు అప్లై చేయాలి. అరగంట తర్వాత క్లీన్ చేయాలి. ఇలాచేస్తే ముఖంపై ఉన్న ట్యాన్ పోతుంది.

టొమాటో హనీ ప్యాక్..

టొమాటో జ్యూస్ లో తేనె కలిపి..ముఖానికి మెడకు అప్లై చేయాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. దానివల్ల చర్మం మెరిసిపోతుంది.