శంషాబాద్ విమానాశ్రయంలో రన్-వేపైనే ఆగిపోయిన విమానం.. ఒక్కసారిగా భయపడ్డ ప్రయాణికులు..

శంషాబాద్ విమానాశ్రయంలో రన్-వేపైనే ఆగిపోయిన విమానం.. ఒక్కసారిగా భయపడ్డ ప్రయాణికులు..

 శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా  అలయన్స్ ఎయిర్ లైన్స్ రన్-వే పైనే నిలిచిపోయింది. దింతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఈ అలయన్స్ విమానం దాదాపు గంట సేపు పైగానే రన్నేపై ఆగిపోయింది. సమాచారం ప్రకారం విమానం రన్ వేపై నుండి బయలుదేరుతుండగా  మూడుసార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై వెంటనే ఫ్లైట్ ను నిలిపివేశాడు. దింతో ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై కిందకి దిగారు. 

అయితే  ఈ విమానంలో సుమారు 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. సాంకేతిక లోపం కారణంగా విమానం దిగిన ప్రయాణికులు ఫ్లయిట్ స్టార్ట్ అయ్యే ముందు  
సాంకేతిక లోపాలను ముందుగా చూసుకోవడం తెలిదా అంటూ సంబంధిత ఎయిర్ లైన్స్ పై ఆందోళన  వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. గతంలో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరిచిపోకముందే చాల విమానాల్లో సాంకేతిక లోపాలు ప్రయాణకులను భయభ్రాంతులకి గురిచేస్తున్నాయి.