
హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు త్వరలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇవాళ (ఆగస్ట్ 25న) ఈ జంట సోషల్ మీడియా వేదికగా ఈ గుడ్ న్యూస్ ప్రకటించారు. అభిమానులు మరియు శ్రేయోభిలాషులతో ఫోటో మరియు వీడియో ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘మా చిన్న ప్రపంచం వస్తోంది.. మీ విలువైన ఆశీస్సులు అందించండి’ అని ఈ జంట కోరింది.
ఈ క్రమంలో పోస్ట్ వైరల్ అవ్వడంతో సినీ సెలబ్రెటీలు, తమ ఫ్యాన్స్ విషెష్ చెబుతున్నారు. వారిలో సోనమ్ కపూర్, భూమి పెడ్నేకర్, హుమా ఖురేషి మరియు నేహా ధూపియా తదితరులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా సెప్టెంబర్ 24, 2023న ఉదయపూర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్ళికి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు.
ఇకపోతే, పరిణీతి చోప్రా చివరిసారిగా 2024లో ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన "అమర్ సింగ్ చంకిలా"లో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి కనిపించారు. ప్రస్తుతం రెంజిల్ డి'సిల్వా దర్శకత్వం వహించిన తాహిర్ రాజ్ భాసిన్ సరసన రాబోయే నెట్‌ఫ్లిక్స్ షోలో కనిపించనుంది.