
'బిగ్ బాస్' హౌస్ లో అడుగుపెట్టే సామాన్యుల ఎంపిక ఉత్కంఠగా సాగుతోంది. దీనికోసం అగ్నిపరీక్షలంటూ ఒక కొత్త తరహా ప్రక్రియ నడుస్తోంది. టాప్ 15 కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్ నిర్వహకులు ఈ ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ జియో హాట్ స్టాట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్‌లో చేరగా, మిగిలిన 16 మంది హోల్డ్‌లో ఉన్నారు. వీరిని పరీక్షించేందుకు 'బిగ్‌బాస్ డేర్ ఆర్ డై' అంటూ కొన్ని విచిత్రమైన, సవాలుతో కూడిన టాస్కులు ఇచ్చారు. ఎవరు తమ ధైర్యం, నిబద్ధతతో ముందుకు వచ్చి గెలిచారో , నాలుగో ఎపిసోడ్ లో ఏం జరిగిందే చూద్దాం..
అరగుండుతో టాప్ 15లోకి మాస్క్ మ్యాన్ హరీశ్!
మొదటి సవాలులో బిగ్‌బాస్ మాస్క్ మ్యాన్ హరీశ్, సాయికృష్ణలను పిలిచి ఒక విచిత్రమైన ఛాలెంజ్ ఇచ్చారు. సీజన్ మొత్తం అరగుండుతోనే ఉండాలని కండిషన్ పెట్టి, దాన్ని వెంటనే అమలు చేయమన్నారు. క్షణం కూడా ఆలోచించకుండా మాస్క్ మ్యాన్ హరీశ్ ట్రిమ్మర్ అందుకుని తన అరగుండు గీసుకున్నాడు. అతని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన జడ్జిలు, హరీశ్‌ను విజేతగా ప్రకటించి టాప్ 15లోకి పంపించారు. ఈ ధైర్యసాహసం హరీశ్‌ను ప్రేక్షకుల దృష్టిలో హీరోగా నిలిపింది.
'ఐ లవ్ బిగ్‌బాస్' టాటూతో శ్రీజ సాహసం!
తరువాత, దమ్ము శ్రీజ, మోడల్ ఊర్మిళలను పిలిచి, నుదుటిపై 'ఐ యామ్ లూజర్' అని పచ్చబొట్టు వేయించుకోవాలని సవాలు విసిరారు. మోడలింగ్ కెరీర్ కారణంగా ఊర్మిళ ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. కానీ శ్రీజ ధైర్యంగా ముందుకు వచ్చింది. ఆమె సాహసాన్ని మెచ్చుకున్న జడ్జిలు 'ఐ యామ్ లూజర్'కు బదులుగా 'ఐ లవ్ బిగ్‌బాస్' అని పచ్చబొట్టు వేయించారు. శ్రీజ నిజంగానే చాలా ధైర్యవంతురాలని ఈ టాస్క్‌తో మరోసారి నిరూపించింది.
10 నిమిషాల్లో కిలో బరువు పెరిగే టాస్క్
సోల్జర్ పవన్ కల్యాణ్, అబూలకు బిగ్‌బాస్ ఒక భిన్నమైన సవాలు ఇచ్చారు అభిజీత్. కేవలం 10 నిమిషాల్లో కిలో బరువు పెరగాలని ఆదేశించారు. ఇందు కోసం వారి ముందు బిర్యానీ, బర్గర్లు పెట్టారు. ఈ ఛాలెంజ్‌ను పవన్ కల్యాణ్ విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ టాప్ 15లో చోటు సంపాదించుకున్నారు.
వివాదాస్పద విజేత ప్రియ!
ఆ తర్వాత ఒంటిచేత్తో బెలూన్ పగలగొట్టే టాస్క్‌లో ప్రియ, దాలియా పోటీపడ్డారు. ఈ టాస్క్‌లో ప్రియ రెండు చేతులు ఉపయోగించి దాలియాను ఓడించింది. జడ్జిలు ఈ విషయాన్ని గమనించక పోవడంతో ప్రియను విజేతగా ప్రకటించారు. నిజానికి ఇది అన్‌ఫెయిర్ అనిపించినా, ప్రియకు ఫైనల్స్‌లో స్థానం దక్కింది.
కల్కి, షాకీబ్ మధ్య మనీ ఛాలెంజ్..
షాకీబ్, కల్కిలకు బిగ్‌బాస్ యాంకర్ శ్రీముఖి ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎవరి అకౌంట్‌లో ఎక్కువ డబ్బులు పడతాయో వారే గెలిచినట్లు ప్రకటించారు. కల్కి తన స్నేహితుడికి ఫోన్ చేసి రూ.90 వేలు అకౌంట్‌లో వేయించుకుంది. కానీ షాకీబ్‌కు టాస్క్ సరిగ్గా వివరించకపోవడంతో అతను కేవలం రూ.10 వేలు మాత్రమే అడిగాడు. తర్వాత మరో అవకాశం ఇచ్చినా కేవలం రూ.50 వేలే వచ్చాయి.
శ్రీముఖిపై శ్రీజ ఫైర్!
అయితే టాస్క్‌లో స్పష్టత లేదని షాకీబ్ ప్రశ్న లేవనెత్తాడు. దీనికి శ్రీముఖి.. ఎవరికైనా అన్‌ఫెయిర్ అనిపించిందా? అని అడగ్గా, దమ్ము శ్రీజ ధైర్యంగా చేయెత్తింది. శ్రీముఖి ఆమెను మాట్లాడనివ్వకుండా ఆపేసింది. కానీ జడ్జి నవదీప్ శ్రీజను పిలిచి ఎందుకు అలా అనిపించిందని అడిగాడు. కల్కికి టాస్క్ వివరంగా చెప్పారు, కానీ షాకీబ్‌కు చెప్పలేదు అని శ్రీజ ధైర్యంగా వివరించింది. ఈ మాటలకు నవదీప్ షాకీబ్ కన్ఫ్యూజ్ అయితే ఎవరి తప్పు అని సీరియస్ అయ్యారు. అతిగా ఆలోచించొద్దు వెళ్లి కూర్చో అని శ్రీఖపై నవదీప్ కోపంగా మాట్లాడాడు. ఈ ఘటన ఈ ఎపిసోడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
మొత్తానికి, ఈ నాలుగో ఎపిసోడ్‌లో హరీశ్, శ్రీజ, ప్రియ, కల్కిలు టాప్ 15లోకి అడుగుపెట్టారు. ఈ ఛాలెంజ్‌లు, వివాదాలు బిగ్‌బాస్ హౌస్‌లో మరిన్ని ఆసక్తికరమైన మలుపులకు దారి తీస్తూ.. ప్రేక్షక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ 'ఆగ్ని పరీక్ష 'ఆగస్టు 22 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ ప్రోగ్రామ్ స్ట్రీమింగ్ అవుతుంది. రోజూ ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షోకు నవదీప్, అబిజీత్ , బిందు మాధవి జడ్జీలుగా, హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్నారు.