
టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఎప్పటికప్పుడు ముందుంటుంది. అయితే గత కొంతకాలంగా తక్కువ ధరకు ఇంటర్నెట్ ప్లాన్గా పేరుపొందిన 1gb డేటా ప్లాన్లను ఇప్పుడు జియో తొలగించింది. వీటిలో రూ.209, రూ.249 ప్లాన్స్ ఉన్నాయి.
ఇవి రోజుకి 1GB డేటాతో పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్, SMSలు, కొన్ని జియో యాప్స్ కి యాక్సెస్ ఇస్తుండేవి. కానీ ఇప్పుడు మీరు వీటికంటే బెస్ట్ అలాగే తక్కువ ధర ఉన్న ప్లాన్ ఏది అని ఆలోచిస్తే 1.5GBతో డైలీ డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్ అందించే 6 ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి మీకోసం... అంతేకాదు వీటిలో కొన్ని ఆన్ లిమిటెడ్ 5G డేటాతో కూడా వస్తాయి.
Also read:-ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్లు మారాయ్.. రోజుకు 1.5 జీబీ డేటా కావాలంటే..
రూ.349 ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. దీనితో మీకు రోజుకు 2GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందోచ్చు. ఇంకా ఈ ప్లాన్‌తో 90 రోజుల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తుంది. అలాగే కొన్ని OTT యాప్స్ యాక్సెస్ కూడా ఉంటుంది.
రూ. 329 ప్లాన్: ఈ ప్లాన్ కూడా 28 రోజుల వాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం జియో సావన్ ప్రో, రెండు ఇతర OTT బెనిఫిట్స్ కూడా ఇందులో ఉన్నాయి.
రూ. 319 ప్లాన్: ఈ ప్లాన్ చాల ప్రత్యేకమైనది. ఎందుకంటే 28 రోజుల వాలిడిటీకి బదులు ఒక పూర్తి నెల అంటే 31 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇందులో రోజుకు 1.5GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, దీనితో పాటు రెండు OTT ప్రయోజనాలు కూడా ఇస్తుంది.
రూ. 299 ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు అందిస్తుంది. ఇందులో రెండు OTT యాప్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. డేటా అలాగే స్ట్రీమింగ్ ప్లాన్ కావాలనుకునేవారికి వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.
రూ.239 ప్లాన్: ఈ ప్లాన్ 22 రోజుల వాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు . ఇందులో రెండు OTT యాప్స్ ఆక్సెస్ కూడా ఉంటాయి. ఎక్కువ డేటా అవసరం అనుకునేవారికి వారికి ఈ ప్లాన్ బెస్ట్.
రూ.198 ప్లాన్: ఈ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ డేటా అందించే ప్లాన్. 14 రోజుల వాలిడిటీతో రోజుకు 2GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు పంపొచ్చు. ఈ ప్లాన్ కూడా రెండు OTT బెనిఫిట్స్ ఇస్తుంది. తక్కువ కాలానికి ఎక్కువ డేటా అవసరం ఉన్నవారికి ఇది బెస్ట్ ఛాయిస్.