
శివకార్తికేయన్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మదరాసి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శివ కార్తికేయన్ కు కోలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన మురుగదాస్ కలవడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. మురుగదాస్ కు దాదాపు ఏడేళ్లుగా సరైన హిట్ లేకపోయినా ఈ సినిమాపై ముందు నుంచి పాజిటివ్ బజ్ వస్తోంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. తన చివరి మూడు సినిమాలతో ట్రాక్ తప్పిన మురుగదాస్.. తనకు కలిసొచ్చిన యాక్షన్ థ్రిల్లర్ తో మళ్ళీ తన రూట్ లోకి వచ్చేశాడు. తమిళనాట ఎంతగానో ఎదురు చూస్తున్న మదరాసి ట్రైలర్ ఆదివారం (ఆగస్టు 24) రిలీజ్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఏఆర్ మురుగదాస్ కెరీర్ చూసుకుంటే మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే యాక్షన్ థ్రిల్లర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కత్తి ముందు వరకు తీసిన గజినీ, తుపాకీ, సెవెన్త్ సెన్స్ లాంటి సినిమాలతో యాక్షన్ థ్రిల్లర్స్ కు కేరాఫ్ గా నిలిచాడు. ఇప్పుడు కూడా తన బలాన్ని నమ్ముకున్న ఈ కోలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేశాడు. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న శివకార్తికేయన్ తో జత కట్టి కంబ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు. తన సినిమాలోని తుపాకీ లాంటి పవర్ ప్యాక్డ్ తో కూడిన యాక్షన్ సినిమాకు గజినీ మాదిరి సైకలాజికల్ ఎలిమెంట్స్ టచ్ చేసినట్టు ట్రైలర్ లో అర్ధమవుతోంది.
►ALSO READ | OG: ‘సువ్విసువ్వి’ మెలోడీతో ‘ఓజీ’ సెకండ్ సింగిల్.. రిలీజ్ ఎప్పుడంటే?
హీరో శివకార్తికేయన్ తన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటమే మదరాసి కథ అని తెలుస్తోంది. డైరెక్టర్ మురుగదాస్ ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ సీన్స్ తో నింపేశాడు. లవ్ స్టోరీ, సాంగ్స్ లాంటి ఎలిమెంట్స్ ను పూర్తిగా పక్కన పడేశాడు. లీడ్ రోల్ లో శివకార్తికేయన్ ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్నే చూపించినట్టు తెలుస్తోంది. అమరన్ తో తన కెరీర్ లో అతి పెద్ద హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో.. మరోసారి గన్స్ తో ట్రైలర్ లో విధ్వంసం సృష్టించాడు. తన కెరీర్ లో మరో మైల్ స్టోన్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. హీరోయిన్ రుక్మిణి పాత్రకు మంచి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. తుపాకీ సినిమా తర్వాత మురుగదాస్ మరోసారి విలన్ గా విద్యుత్ జమాల్ కు అద్భుతమైన క్యారక్టర్ డిజైన్ చేసినట్టు ట్రైలర్ లో అర్ధమవుతోంది.
డిఫరెంట్ గెటప్ లో సోనూసూద్ విలనిజం ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ ను నెక్స్ట్ లెవల్లోకి తీసుకెళ్లాడు. ప్రపంచ వ్యాప్తంగా మదరాసి సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను భారీగా శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మిస్తుంది. వరుస ఫ్లాపులతో ఉన్న మురుగదాస్ కు ఈ సినిమా హిట్ చాలా కీలకం. మరోవైపు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే శివకార్తికేయన్ అగ్ర హీరోల లిస్టులోకి చేరడం ఖాయంగా కనిపిస్తుంది.