OG: ‘సువ్విసువ్వి’ మెలోడీతో ‘ఓజీ’ సెకండ్ సింగిల్.. రిలీజ్ ఎప్పుడంటే?

OG: ‘సువ్విసువ్వి’ మెలోడీతో ‘ఓజీ’ సెకండ్ సింగిల్.. రిలీజ్ ఎప్పుడంటే?

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’. ప్రియాంక అరుళ్ మోహన్‌‌‌‌ హీరోయిన్. ఇందులో కన్మణి అనే క్యారెక్టర్లో ప్రియాంక నటిస్తుంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించి రెండు స్పెషల్ పోస్టర్స్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మూవీ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

వినాయక చవితి (ఆగస్టు 27) సందర్భంగా ‘సువ్విసువ్వి’పాట ఉదయం 10:08 గంటలకు రానుందని తెలిపారు. 'మీరు అగ్ని ఎలా ధ్వనిస్తుందో ఫస్ట్ సాంగ్తో విన్నారు. ప్రేమ మరియు భావోద్వేగం ఎలా ఉంటాయో సెకండ్ సింగిల్తో చూస్తారని' మేకర్స్ వెల్లడించారు. పవన్ పోషిస్తున్న ఓజాస్ గంభీరకు భార్య పాత్రలో కన్మణి కనిపించబోతోందని తెలుస్తోంది. 

సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ విలన్‌‌‌‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.

►ALSO READ | Netflix Movies: నెట్‌ఫ్లిక్స్లో ఇంట్రెస్టింగ్గా రెండు కొత్త సినిమాలు, క్రైమ్, హారర్ థ్రిల్లర్ జోనర్లో!