ఒంటరి మహిళలే టార్గెట్‌‌‌‌.. ట్రాప్ చేసి రేప్ తర్వాత ఎస్కేప్

ఒంటరి మహిళలే టార్గెట్‌‌‌‌.. ట్రాప్ చేసి రేప్ తర్వాత ఎస్కేప్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కల్లు కాంపౌండ్ కి వచ్చే మహిళలను టార్గెట్ ​చేసి అత్యాచారాలు, బంగారం చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ ​చేశారు. అతని నుంచి 90 గ్రాముల బంగారు నగలు, రూ.45 వేలు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. సీపీ మహేశ్‌‌‌‌భగవత్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌‌‌‌ జిల్లా ఘట్‌‌‌‌కేసర్ మండలం నారపల్లికి చెందిన హుస్సేన్ ఖాన్‌‌‌‌(49) కూరగాయల వ్యాపారి. తాగుడుకి బానిసై డైలీ కల్లు కాంపౌండ్​కు వెళ్లేవాడు. అక్కడికి వచ్చే ఒంటరి మహిళలకు డబ్బు ఆశచూపి ట్రాప్​ చేసేవాడు. కల్లు తాగాక తనతోపాటు నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి రేప్​ చేసేవాడు. వారి ఒంటిపై ఉన్న గోల్డ్, సిల్వర్​ఆర్నమెంట్స్​ లాక్కుని ఎస్కేప్​అయ్యేవాడు. అలా హైదరాబాద్‌‌‌‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 2005 నుంచి 2016 వరకు 9 నేరాలు చేశాడు. ఈ క్రమంలో గోపాలపురం పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో హుస్సేన్​పోలీసులకు చిక్కాడు. పీడీ యాక్ట్‌‌‌‌పై ఏడాది పాటు చర్లపల్లి జైలుకెళ్లాడు.

అయినా మారని తీరు.. 

2017లో జైలు నుంచి రిలీజ్‌‌‌‌ అయ్యాడు. ఆ తర్వాత గ్రేటర్‌‌‌‌ పరిధిలోని కల్లు కంపౌండ్లకు వచ్చే మహిళలను మళ్లీ టార్గెట్‌‌‌‌ చేశాడు. ఇద్దరు మహిళలు మాత్రమే రేప్‌‌‌‌ అండ్‌‌‌‌ రాబరీ కింద పోలీసులకు కంప్లైంట్‌‌‌‌ చేశారు. రెండు కమిషనరేట్ల పరిధిలో హుస్సేన్ 17 నేరాలు చేసినా ఎక్కడా కూడా అతనిపై కంప్లైంట్​ చేయలేదు. ఈ నెల1న జిల్లేల్‌‌‌‌గూడ కల్లు కంపౌండ్‌‌‌‌ నుంచి  ఓ మహిళను ట్రాప్ చేసి పెద్ద అంబర్‌‌‌‌‌‌‌‌పేట ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌ ‌‌‌‌వద్దకు తీసుకెళ్లాడు. ఆమె నుంచి బంగారంతోపాటు రూ.25 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేలు లాక్కుని ఎస్కేప్‌‌‌‌ అయ్యాడు. బాధితురాలి కంప్లైంట్‌‌‌‌తో హయత్‌‌‌‌నగర్‌‌‌‌ ‌‌‌‌పోలీసులు కేసు ఫైల్​ చేయగా ఎల్‌‌‌‌బీనగర్‌‌‌‌ ‌‌‌‌సీసీఎస్‌‌‌‌ టీమ్‌‌‌‌ గురువారం హుస్సేన్‌‌‌‌ఖాన్‌‌‌‌ను అరెస్ట్ చేసింది.