హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా (25 సంవత్సరాల కంటే ఎక్కువ) న్యాయవాది నాగులూరి కృష్ణకుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 26న కార్యవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. కృష్ణకుమార్ గౌడ్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
