ర్యాగింగ్ వల్లే ప్రీతి మృతి! సైఫ్కు పదేళ్లు జైలు శిక్ష?

ర్యాగింగ్ వల్లే ప్రీతి మృతి! సైఫ్కు పదేళ్లు జైలు శిక్ష?

వరంగల్ కేఎంసీ డాక్టర్ ప్రీతి మరణంపై వరంగల్ సీపీ రంగనాథ్ కీలక విషయాలు బయటపెట్టారు. ప్రీతి మరణానికి సూసైడ్ లేదా కార్డియాక్ అరెస్ట్ కారణమై ఉండొచ్చని భావిస్తున్నాట్లు సీపీ తెలిపారు. హత్య అనే కోణంలో కూడా విచారణ జరిపామని, అయితే, ఆ విషయంపై ఎక్కడా ఆధారాలు లభించలేదని వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు ప్రకటిస్తామని, రిపోర్టు కోసం వేచి చూస్తున్నామని రంగనాథ్ తెలిపారు.

ప్రీతిపై ర్యాగింగ్ జరిగినట్లు నిర్దారణ అయింది. పోస్టుమార్టంలో ప్రీతీ హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు నిర్దారణ అయినా దాన్ని ర్యాగింగ్ వల్ల జరిగిన మరణంగానే పరిగణంలోకి తీసుకుంటామని రంగనాథ్ వెల్లడించారు.

పోలీసులు.. సైఫ్ కాల్ డేటా, కాలేజీ సీసీ ఫుటేజ్ కూడా తీసుకున్నారు. అయితే, అందులో హత్య అనే కోణంలో ఎక్కడా ఆధారాలు లభించలేదని తెలిపారు. దాంతో సైంటిఫిక్ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.

అయితే, ర్యాగింగ్ వల్ల ఒక యువతి మరణానికి కారణమైన సైఫ్ కు 306 సెక్షన్ ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రీతీ.. మరణానికి ముందు పూర్తిగా డిస్టర్బ్ కావడానికి సైఫ్ మెంటల్ హరాస్మెంటే కారణమని పోలీసులు తేల్చిచెప్పారు. కాజ్ ఆఫ్ డెత్ ను ర్యాగింగ్ గా పరిగణించారు. అయితే, టాక్స్ కాలజీ రిపోర్టుతో మరణానికి కారణాలు దృవీకరించలేమని అందుకే పోస్టు మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.