సైబర్ నేరాలకు అడ్డుకట్ట.. సైబర్ మిత్ర పోర్టల్ ప్రారంభం..!

సైబర్ నేరాలకు అడ్డుకట్ట.. సైబర్ మిత్ర పోర్టల్ ప్రారంభం..!

సైబర్​ క్రిమినల్స్​ రెచ్చిపోతున్నారు. టెక్నాలజీని వాడాలంటే భయమేస్తుంది.  ఎక్కడ సైబర్​ దొంగలు జొరపడతారేమోననే ఫియర్​ తో అవసరాలకు వాడటం తప్పనిసరి అవుతుంది.  కొంతమంది మోసపోయినా పోర్టల్​లో ఫిర్యాదు చేసి పోలీస్​ స్టేషన్​ కు బాధితులు వెళ్లడంలేదు దీనిని ఆసరాగా తీసుకుంటున్న సైబర్​ కేటుగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు హైదరాబాద్​ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో యువతులు, అమ్మాయిలు మోసపోతున్నారు..

సైబర్ నేరాల బాధితుల కోసం   సైబర్ మిత్ర పేరుతో కొత్త కార్యక్రమాన్ని హైదరాబాద్ సిపి సజ్జనార్  ప్రారంభించారు.  1930... నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదులు చేసిన తర్వాత చాలామంది స్టేషన్ కు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారికోసం ప్రత్యేక
వారికోసం ప్రత్యేకంగా సెల్ ను ఏర్పాటు చేశారు. 

సైబర్​ బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదును పోస్ట్ ద్వారా... డ్రాప్ బాక్స్ ద్వారా స్వీకరించేందుకు  పోలీసులు ఏర్పాటుచేశారు.  బషీర్​ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో  సైబర్ మిత్ర సెల్ ను ప్రారంభించిన సిపి సజ్జనార్... సైబర్​ బాధితులకు అండగా ఉంటామన్నారు.  ఇంటి నుంచే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 


సైబర్​ బాధితులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే సైబర్ క్రైమ్స్  ఇంటి నుంచే .. FIR నమోదు చేసి పోలీసులు సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  చాలామందికి  పిర్యాదు ఎలా చేయాలి.. ఎలా కంప్లైంట్ రాయాలి.. ఏం సెక్షన్స్ వర్తిస్తాయి..అనే విషయాలు తెలియదని..  బాధితులకు ఎలా పిర్యాదు చేయాలి.. అనే అవగాహన కల్పిస్తూ.. పోలీస్ స్టేషన్ కు రాకుండానే పిర్యాదు చేసి FIR పొందవచ్చన్నారు..

దేశంలో ఎక్కడ లేని విధంగా సి మిత్రా ను ప్రారంభించామని సీపీ సజ్జనార్​ తెలిపారు.  ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు C మిత్రా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం  24 మంది సిబ్బంది తో ఈ పోర్టల్ ప్రారంభించామని ఇంకా సిబ్బందిని పెంచుతామన్నారు. 

నేషనల్ సైబర్ పోర్టల్ కి వచ్చే పిర్యాదుల్లో కేవలం 18 శాతం మాత్రమే FIR లు అవుతున్నాయి. 82 శాతం బాధితులు సైబర్ క్రైమ్ PS కి వచ్చి పిర్యాదులు చేయడం లేదని.. అందుకోసమే  సైబర్​ మిత్రా పోర్టల్ ఏర్పాటు చేసామన్నారు.

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే.. ప్రజలు అవగాహనతో ఉండాలన్నార.  ట్రేడింగ్, ఓటీపీ, ఇన్వెస్ట్మెంట్ మోసాలు భారీగా పెరుగుతున్నాయని..  ఎవరూ భయపడవద్దు.. సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు.  అందుకోసమే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము.