దిల్‌‌‌‌సుఖ్నగర్ మెట్రో వద్ద అర్ధరాత్రి సీపీ సుమతి ఆపరేషన్ పోకిరి

దిల్‌‌‌‌సుఖ్నగర్ మెట్రో వద్ద అర్ధరాత్రి సీపీ సుమతి ఆపరేషన్ పోకిరి
  • దిల్‌‌‌‌సుఖ్​నగర్ ​మెట్రో వద్ద అర్ధరాత్రి ఒంటరిగా మల్కాజిగిరి కమిషనర్‌‌‌‌‌‌‌‌
  • స్థానిక పోలీసులకు తెలియకుండా సివిల్​ డ్రెస్‌‌‌‌లో వెళ్లిన ఆఫీసర్​
  • మూడున్నర గంటలపాటు అక్కడే.. వస్తావా?’ అంటూ పోకిరీల సతాయింపు 
  • తెల్లారి మూడయ్యేదాకా రాని ఒక్క పెట్రోలింగ్​ వెహికల్ 
  • ఆ ప్రాంతంలో నిరంతర గస్తీ పెంచాలని పోలీసులకు ఆదేశాలు
  • 40 మంది ఆకతాయిలకు కౌన్సిలింగ్‌‌‌‌

ఎల్‌‌‌‌బీనగర్/ దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ నగరంలో అర్ధరాత్రి ఒంటరిగా తిరిగే మహిళలు ఏ విధంగా వేధింపులకు గురవుతున్నారు? పోలీసుల నుంచి వారికి ఏ రకమైన రక్షణ ఉందో తెలుసుకోవడంతోపాటు పోకిరీల చేష్టలకు చెక్​పెట్టడానికి మల్కాజిగిరి కమిషనర్ ​సుమతి స్వయంగా రంగంలోకి దిగారు. కమిషనర్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే (గత శుక్రవారం) ఆమె..‘ఆపరేషన్​ పోకిరి’ చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా బయటపెట్టారు. యూనిఫాంలో కాకుండా సివిల్​ డ్రెస్‌‌‌‌లో సాధారణ మహిళలా.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా దిల్‌‌‌‌సుఖ్​నగర్​ఏరియాలో అర్ధరాత్రి మూడున్నర గంటల పాటు ఒంటరిగా నిల్చున్నారు.

స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. కేవలం కొద్ది మంది సిబ్బందితో ఆమె ఈ ఆపరేషన్​చేపట్టారు. ఈ సందర్భంగా కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి ‘వస్తావా? రేటెంత?’ అని కూడా మాట్లాడారు. దీన్నంతా సమీపంలోనే ఉన్న ఆమె సిబ్బంది వీడియో తీశారు. చివరికి తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో ఒక బీట్​కానిస్టేబుల్​ఆమెను చూసి గుర్తించి సెల్యూట్​చేయడం..విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఆమె ఉన్న ప్రాంతానికి చేరుకోవడం జరిగిపోయాయి. ఈ ఆపరేషన్​లో దొరికిన 40 మంది యువకుల్లో స్టూడెంట్స్​కూడా ఉండడం గమనార్హం. వారందరికీ కౌన్సెలింగ్​ఇచ్చి వదిలిపెట్టారు. 

మేడమ్​ ఇది చాలా రిస్కీ ఆపరేషన్​..వద్దు.. 

నగరంలో రాత్రి 11 గంటలు దాటితే ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే అసభ్యంగా ప్రవర్తిస్తూ చుట్టుముట్టి వేధిస్తున్నారు. వాటికి చెక్​పెట్టేందుకు మల్కాజిగిరి సీపీ సుమతి నిర్ణయించుకున్నారు. మే 1న బాధ్యతలు స్వీకరించగా, అదే రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. సాధారణ మహిళగా అర్ధరాత్రి ఏదో ఒక ఏరియాలో తిరగాలనుకున్నారు. ఇది విన్న ఆమె భద్రతా సిబ్బంది.. ‘ మేడమ్​..వద్దు ఇది చాలా రిస్కీ ఆపరేషన్’ అని రిక్వెస్ట్ ​చేశారు. తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానని, ‘ఆపరేషన్ పోకిరీ’లో ఎలాంటి మార్పు లేదని ఆమె స్పష్టం చేశారు. నలుగురైదుగురు భద్రతా సిబ్బంది మఫ్టీలో వెంటరాగా అర్ధరాత్రి 12 గంటలకు సివిల్​ డ్రెస్‌‌లో దిల్‌‌సుఖ్​నగర్​మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నారు.  అక్కడ వెహికల్​దిగాక ‘మీరెవరు నా వెంట కానీ, దరిదాపుల్లో కానీ ఉండొద్దు.. నేను చూసుకుంటా’ అని స్పష్టం చేశారు. దీంతో  కొద్దిదూరం వెళ్లి ఎవరికి కనిపించకుండా ఆమె భద్రతా సిబ్బంది నిలబడ్డారు. 

‘హలో వస్తావా?’..

దిల్‌‌సుఖ్​నగర్ ​మెట్రో స్టేషన్​ కింద రోడ్డుపై నిలబడిన సీపీ సుమతిని చూసిన కొంతమంది యువకులు ఆమె దగ్గరకు వచ్చారు. ‘హలో వస్తావా..నీ రేటెంత? అని అడగడం మొదలుపెట్టారు. దీనికి ఆమె సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ఇలా నిమిష నిమిషానికి యువకులు రావడం అడగడం, వెళ్లడం చేశారు. కొందరు నడుచుకుంటూ వెళ్లే ఆమెను చూసి అక్కడే ఆగిపోయారు. సీపీ వెనకే నిలబడి కామెంట్స్​చేస్తూ ఉన్నారు. అసౌకర్యంగా ఫీలయిన ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా వెంటపడ్డారు. అసభ్యమైన కామెంట్స్​చేశారు. ‘ఆంటీ..ఏంటీ మాట్లాడడం లేదు..ఎవరికోసమైనా వెయిట్​చేస్తున్నావా? మాతో వస్తావా?’ అంటూ కామెంట్‌‌ చేశారు. కొంతమంది సీపీని టచ్ ​చేయడానికి ప్రయత్నించారు. ఇలా సుమారు 40 మంది సీపీ సుమతిని మాటలతో, చేష్టలతో వేధించారు.  

జాడ లేని పెట్రోలింగ్ ​వెహికల్​

ప్రతి పోలీస్​స్టేషన్​పరిధిలో రాత్రిళ్లు పోలీసులు పెట్రోలింగ్​ చేస్తూ ఉంటారు. అయితే, కమిషనర్ ​అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారి మూడున్నర గంటల వరకు నిలబడినా ఒక్క పెట్రోలింగ్​ వెహికల్​ కనిపించలేదు. అది గల్లీనో...లోపల ఎక్కడో ఉండే ప్లేస్​అంటే ఏమో అనుకోవచ్చు. సాక్షాత్తు దిల్‌‌సుఖ్​నగర్​మెట్రో కింద ఒక మహిళను మూడున్నర గంటల పాటు వేధిస్తున్నా బ్లూ కోర్ట్ కానీ, పెట్రోలింగ్ పోలీస్ కూడా రాలేదు. మూడున్నర గంటల తర్వాత తెల్లవారుజామున అటుగా వచ్చిన ఓ కానిస్టేబుల్‌‌.. అక్కడ ఓ మహిళ ఒంటరిగా నిల్చోవడం గమనించాడు. కొందరు కుర్రాళ్లు ఆమె వెంట పడుతుండడంతో దగ్గరకు వెళ్లాడు. ఆ మహిళ ఫేస్ ​చూసి షాక్ ​తిన్నాడు. ‘మేడమ్ ​మీరు..ఇక్కడా?’ అంటూ సడన్‌‌గా సెల్యూట్​ చేశాడు. దీంతో ఆమె వెంట ఉండి సతాయిస్తున్న యువకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ‘వామ్మో..పోలీస్​ ఆఫీసర్’ అంటూ పరుగందుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఆఘమేఘాలపై అక్కడకు చేరుకున్నాడు.