నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో పేదలకు అండగా సీపీఐ..ఘనంగా శతాబ్ది ఉత్సవాలు

నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో పేదలకు అండగా సీపీఐ..ఘనంగా శతాబ్ది ఉత్సవాలు

నస్పూర్/కోల్​బెల్ట్/​మంచిర్యాల/ఆసిఫాబాద్/బెల్లంపల్లి, వెలుగు: సీపీఐ శతాబ్ది ఉత్సవాలను నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద, రామకృష్ణాపూర్​లోని పార్టీ ఆఫీస్​లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్  జెండా ఎగరవేసి మాట్లాడారు. వందేండ్ల చరిత్ర కలిగిన సీపీఐ దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల పక్షాల.. కార్మికులు, రైతుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. 

1969లో తెలంగాణ ఉద్యమంతో పాటు సాయుధ పోరాట ఉద్యమాలు చేపట్టిన ఘనత కమ్యూనిస్టు పార్టీదన్నారు. శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జనవరి 18న ఖమ్మంలో నిర్వహిస్తున్నమని, ఈ ప్రాంత ప్రజలందరూ  హాజరుకావాలని కోరారు. పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, మండల సహాయ కార్యదర్శి రవి, జిల్లా సమితి సభ్యుడు రవీందర్, బీసీ సాధన సమితి మండల కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్​లో ఆ పార్టీ జిల్లా మాజీ  కార్యదర్శి బద్రి సత్యనారాయణ జెండా    ఎగురవేశారు. 

దేశంలో ఏర్పడిన మొట్టమొదటి రాజకీయ పార్టీ సీపీఐ అని అన్నారు. ప్రజ సమస్యల  పరిష్కరిస్తూ వందేండ్లుగా వారికి అండగా ఉందని అన్నారు. బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో కేక్​కట్​చేసి సంబరాలు చేసుకున్నారు. పట్టణ సహాయ కార్యదర్శి  తిలక్ అంబేద్కర్, మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, బీకేఎంయూ జాతీయ సమితి సభ్యుడు బాబు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బొల్లం సోని పాల్గొన్నారు.