రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్ర‌క‌టించాలి.. ఈ నెల 10 న ధర్నా చేస్తాం

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్ర‌క‌టించాలి.. ఈ నెల 10 న ధర్నా చేస్తాం

కేంద్రం ప్రభుత్వ రంగ ఆస్తులను కార్పొరేట్ కు అప్పనంగా కట్టబెడుతుందని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని ప్రయివేటుపరం చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేన‌ని అన్నారు. సచివాలయ భవనాలను కూల్చివేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని, ప్రజలంతా దీనిని ముక్త కంఠంతో వ్యతిరేకించాలని ఆయ‌న అన్నారు.

కరోనా వైద్యంలో ప్ర‌భుత్వం పారదర్శకత వ‌హించ‌డంలేదన్న చాడ‌.. ప్రభుత్వ వైద్యులకే ఆసుపత్రిలో అధిక చార్జీలు వేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. ప్రయివేటు ఆసుపత్రులు కరోనా పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ల ముందు ధర్నా చేస్తామ‌ని చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రయివేటు పరం చేస్తోందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. ఇస్రోలో ప్రయివేటు భాగస్వామ్యం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని ఆయ‌న‌ త‌ప్పుబ‌ట్టారు. ఇస్రో వల్ల దేశానికి అనేక లాభాలున్నాయని, పొరుగు దేశాల నుంచి ముప్పు ఎదురవుతున్న ఈ తరుణంలో ఈ రంగంలో ప్రైవేట్‌ వ్యక్తులను అనుమతించడం ప్రమాదకర‌మ‌ని అన్నారు. భారత్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడటాన్ని స్వాగతిస్తుస్తున్నామ‌న్నారు