- ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణిని ఖండించలేని స్థితిలో ఉన్నడు
- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శ
ఖమ్మం, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీకి దేశ రైతులు, కార్మికుల గురించి పట్టదని, ఆయన ప్రేమంతా సంపన్న వర్గాలపైనే అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తున్నా ప్రధాని కనీ సం ఖండించలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ముగిసిన తర్వాత ఖమ్మంలో జరిగిన మీడియాతో రాజా మాట్లాడారు.
సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయని చెప్పారు. ఈ ఉత్సవాలకు వేదికగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖలకు ఆయన కృత రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవద్దని భారత్ పై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నా.. మోదీ కనీసం స్పందించడం లేదన్నారు. దేశాన్ని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోదీ చెబుతున్నారు. కానీ నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని పోరాడి సాధించుకుంటే, దానిని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. ఇందుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్య రంగంలోనూ మతాన్ని చొప్పిస్తున్నారని, విద్యా వ్యవస్థను వ్యాపారమయంగా మార్చారని రాజా ఫైర్ అయ్యారు. బీజేపీ పాలన ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో సాగుతున్నదని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ణ పాండా, పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
