ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం..బాధిత కుటుంబాలను సర్కారు ఆదుకోవాలి: నారాయణ

ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం..బాధిత కుటుంబాలను సర్కారు ఆదుకోవాలి: నారాయణ

న్యూఢిల్లీ, వెలుగు: ప్రభుత్వ తనిఖీ విభాగాలు సరిగా పనిచేయకపోవడం వల్లే సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ దుర్ఘటన ప్రభుత్వ వర్గాలకు ఒక మేలుకొలుపని అభిప్రాయపడ్డారు. ప్రమాద బాధితులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఆర్థిక సాయం అందించాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఫ్యాక్టరీ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇది ఫ్యాక్టరీ యాజమాన్యం జరిపిన హత్యగా అభివర్ణించారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉన్న కెమికల్ ఫ్యాక్ట రీలపై తనిఖీ విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.