బిగ్ బాస్ షోపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ షోపై నారాయణ సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ షోపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆయన మరోసారి బిగ్ బాస్ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ తెలుగు హిందీతో పాటు.. పలు ప్రాంతీయ భాషాల్లో కూడా షో నడుస్తున్న విషయం తెలసిందే. తెలుగులో స్టార్ మాలో బిగ్ బాస్ షోన్ ఇప్పటివరకు  5 సీజ‌న్‌లుగా ప్రసారం అయ్యింది. తెలుగు బిగ్ బాస్ ప్రేక్ష‌కులను ఎంతగానో అల‌రించింది. అయితే ఇవాల్టి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్ర‌సారం కానుంది. దీంతో ఈ షోపై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ మ‌రోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆ షో ఓ అధికారిక వ్యభిచార గృహం అని ఆయ‌న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిగ్‌ బాస్‌ షోకు వ్యతిరేకంగా ఇప్పటికే లేఖలు రాశామ‌ని నారాయ‌ణ గుర్తు చేశారు. పోలీస్ స్టేష‌న్ లో కేసు పెడదామని ప్రయత్నిస్తే పోలీసులు తమ పరిధి కాదంటున్నారని ఆయన అన్నారు. దీంతో తాము కోర్టులో కేసులు వేశామ‌ని చెప్పారు. ఇప్పుడు త‌మ పార్టీ ఆధ్వర్యంలో బిగ్‌ బాస్‌ షోకు వ్యతిరేకంగా డిజిటల్‌ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.  బిగ్‌బాస్ షో లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని నారాయ‌ణ అన్నారు. 

200 కెమెరాలు పెట్టాం అంటున్నారని, అయితే, అందులో ఏం జ‌రుగుతుందో అంతా ఎడిటింగ్‌తో తీసేస్తార‌ని ఆయన తెలిపారు. ఈ షో ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నార‌ని ఆయ‌న నిల‌దీశారు. బిగ్ బాస్ షోను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్‌ చేశారు. 
అంతే కాకుండా నాగార్జునపై కూడా నారాయణ సీరియస్ అయ్యారు. భ‌క్తి ర‌స చిత్రాల్లో న‌టించిన నాగార్జున బిగ్‌బాస్ వంటి షోకు వ్యాఖ్యాత‌గా చేయ‌డం సిగ్గుచేటని మండిప‌డ్డారు. 

ఇవి కూడా చదవండి:

మూడు డ్రగ్స్ కేసుల్లో 11 మంది అరెస్ట్

జాతరలొ రికార్డింగ్ డ్యాన్సులు: యువకులపై దాడి.. ఉద్రిక్తత