పాక్ పేరు తలవకుండా మోడీ బతకలేరు

పాక్ పేరు తలవకుండా మోడీ బతకలేరు

హైదరాబాద్, వెలుగు:  పాకిస్థాన్ పేరు తలవకుండా ప్రధాని మోడీ బతకలేరని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. భారతీయులకు  రాజ్యాంగం ఆదర్శమని.. మోడీ, అమిత్​షాలకు మాత్రం పాక్​ ఆదర్శమన్నారు. గురువారం మఖ్దూంభవన్​లో గోవింద్ పన్సారే స్మారక సభలో సురవరం మాట్లాడారు. మతోన్మాద శక్తుల చేతిలో హత్యకు గురైన గోవింద్ పన్సారే వర్ధంతిని దేశవ్యాప్తంగా లౌకిక పరిరక్షణ దినంగా పాటించాలని కోరారు. సీఏఏతో ఎవరికీ నష్టం లేకుంటే అస్సాంలో ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులు, ఆదివాసీలు, పేదలు, వలస కార్మికులకు వారి వారసత్వ ఆధారాలు ఎలా లభిస్తాయని అడిగారు.