- ఎమ్మెల్సీ సత్యం,సీపీఐ నేత నారాయణ
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ నేత నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి జర్నలిస్టుల ఇండ్లపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు.
విచారణ పూర్తి చేయకుండా నిజాలను తేల్చకుండా వెంటనే జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని తెలిపారు. జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
