సురవరం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా

సురవరం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా
  • సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా

బషీర్​బాగ్, వెలుగు: కమ్యూనిస్టు అగ్రనేత, దివంగత సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సురవరం 84వ జయంతి సందర్భంగా ఆయన స్వీయ చరిత్ర “ప్రజలతో నా ప్రయాణం” పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. 

ఈ సందర్భంగా డి. రాజా మాట్లాడుతూ.. సురవరం విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా దేశంలోనే గొప్ప కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ పుస్తకం నేటి తరం రాజకీయ నాయకులందరికీ ఒక దిశానిర్దేశంలా ఉపయోగపడుతుందని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, పల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.