
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు.. పార్టీలు కూడా అందుకు తగ్గట్లుగానే వ్యవహరిస్తుంటాయి. సమయం, సందర్భాన్ని బట్టి తమ నిర్ణయాలను, ఫ్రెండ్స్ ని మారుస్తుంటాయి. కొన్ని ఫ్రెండ్ షిప్ లు కొద్దికాలం మాత్రమే ఉంటాయి. కొన్ని మాత్రం చాలా రోజులు కలిసి కొనసాగాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఇది పార్టీల పెద్దలకు బాగానే ఉన్నా.. కొందరికి మాత్రం నిద్ర పట్టనివ్వడం లేదట.