మురళీ నాయక్ తెలుగు జాతి గర్వించే యువ కిశోరం

మురళీ నాయక్ తెలుగు జాతి గర్వించే యువ కిశోరం

హైదరాబాద్, వెలుగు: పాకిస్తాన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ మురళీనాయక్ తెలుగుజాతి గర్వించే యువకిశోరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ రక్షణలో భాగంగా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టి వీరమరణం పొందారని తెలిపారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడుతున్న భారత సైన్యాన్ని అభినందించారు. భారతదేశమంతా ఏకతాటిపై నిలిచి ఈ పోరాటం చేస్తున్న సైన్యానికి, భారత ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నదని కూనంనేని అన్నారు.