- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, వెలుగు: సింగరేణి, ఆర్టీసీ, జెన్‌కో భవితవ్యంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సంస్థల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీకి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ వాటి భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదన్నారు.
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ పరిధిలోనే కొనసాగించాలని సూచించారు. సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండటంతో పాటు, ఉన్న గనుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిందన్నారు. జెన్‌కో నిధుల వినియోగంపై స్పష్టత లేదని విమర్శించారు. నగరంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిపై ప్రభుత్వం నియంత్రణ ఉందా అని ప్రశ్నించారు.
