బాబాయి హత్య ప్రమాదమా?.. మూడు పెళ్లిళ్లు ప్రమాదమా?: సీపీఐ నారాయణ

బాబాయి హత్య ప్రమాదమా?.. మూడు పెళ్లిళ్లు ప్రమాదమా?: సీపీఐ నారాయణ

సీఎం జగన్ తన హోదాను మర్చిపోయి, మరింత దిగజారి మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ   విమర్శించారు. రాజకీయ పరంగా విమర్శలు చేయకుండా, తరచూ వ్యక్తిగత దూషణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు తరచూ  పవన్ పెళ్లిళ్లగురించి ఆయన భార్యల  గురించి మాట్లాడటం అలవాటుగా మారిందన్నారు. హత్యలు ప్రమాదమా? మూడు పెళ్లిళ్లు ప్రమాదమా? అనేది ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. బాబాయిని చంపడం తప్పు కాదని చెబుతారా? అని నారాయణ నిలదీశారు. పవన్ మూడు పెళ్లిళ్లు గురించి జగన్‌కు ఎందుకన్నారు. వైసీపీపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత రావడంతో దాన్ని మభ్యపెట్టేందుకు సీఎం జగన్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.  రాజకీయంగా పస లేకనే జగన్ ఇతర నేతల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని సెటైర్లు వేశారు. పాలిటిక్స్ పరంగా అయితే తాను చేసిన  మంచి గురించి, అభివృద్ధి పనుల గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం సరైన పద్దని కాదని సీఎం జగన్ కు హితవు పలికారు.