బీజేపీతో పొత్తు భస్మాసుర హస్తమే.. ప్రాంతీయ పార్టీలకు సీపీఐ నారాయణ హెచ్చరిక

బీజేపీతో పొత్తు భస్మాసుర హస్తమే.. ప్రాంతీయ పార్టీలకు సీపీఐ నారాయణ హెచ్చరిక
  • బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే జీఎస్టీ తగ్గించారని ఆరోపణ
  • బీజేపీని నమ్ముకుంటే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు భవిష్యత్ ఉండదు: కూనంనేని 

హైదరాబాద్, వెలుగు: బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలకు భస్మాసుర హస్తంగా మారుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీడీపీ, మహారాష్ట్రలో శివసేనను చీల్చి, ఆ పార్టీలను ధ్వంసం చేసిందని, కుటుంబాల్లో చిచ్చుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ మఖ్దూం భవన్‌‌‌‌‌‌‌‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో పాటు బిహార్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేంద్రం జీఎస్టీ స్లాబులను తగ్గించిందని ఆరోపించారు. 

ఇన్నాళ్లూ కార్పొరేట్లకు ట్యాక్స్ తగ్గిస్తూ.. పేదలపై భారం మోపారని మండిపడ్డారు. ఈ తొమ్మిదేండ్లుగా రూ.4.5 లక్షల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోతే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందనే అనుమానం వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ను దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

పంజాబ్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 21 నుంచి 25 వరకు నిర్వహించే సీపీఐ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీని నమ్ముకుంటే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ భవిష్యత్ దెబ్బతింటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో యూరియా సరఫరాలో లోపాలను గుర్తించి, బ్లాక్‌‌‌‌‌‌‌‌లో ఉంటే బయటికి తీసే ప్రయత్నం చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ పారదర్శకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

నిజాం వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు రావి నారాయణ రెడ్డి

నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీ వర్గాల నుంచి ప్రజలను రక్షించడంతో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు రావి నారాయణరెడ్డి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన పద్మవిభూషణ్‌‌‌‌‌‌‌‌ అవార్డు గ్రహీత రావి నారాయణరెడ్డి 34వ వర్ధంతి సభ జరిగింది. 

తొలుత రావి నారాయణరెడ్డి విగ్రహానికి నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు, రావి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం రావి నారాయణరెడ్డి పోరాటాలు ప్రారంభించారన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగంగా తనకున్న 700 ఎకరాల్లో 500 ఎకరాలను పేదలకు పంచారని గుర్తుచేశారు. కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. రావి నారాయణరెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు.