మతం, రాజకీయాల్ని బీజేపీ ఒకటి చేసింది : నారాయణ

మతం, రాజకీయాల్ని బీజేపీ ఒకటి చేసింది : నారాయణ

న్యూఢిల్లీ, వెలుగు :  మతం, రాజకీయాన్ని బీజేపీ సర్కార్ ఒకటిగా మార్చిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్ మేనేజర్లుగా మందిర వేడు కలు నిర్వహించారని ఫైర్ అయ్యారు. ఒక మతానికి చెందిన ప్రోగ్రామ్​ను ప్రభుత్వం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనేనన్నారు. ఆలయ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు.

ఎన్నికల్లో లబ్ధి కోసమే రామమం దిరం నిర్మాణాన్ని బీజేపీ ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవ న్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రా లైన ఏపీ, తెలంగాణకు బీజేపీ బద్ధ వ్యతిరేకమని విమర్శించారు. బీజేపీని కౌగిలించుకోవడం వల్లే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కేసీఆర్ అధికారాన్ని కోల్పోయారన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అందర్ని కలుపుకొని వెళ్లిందని, దీంతో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఏపీలో జగన్ పాలన చివరి దశకు చేరుకుందన్నారు. జై శ్రీరా మ్ నినాదాన్ని ఎదుర్కొనే సత్తా ‘ఇండియా’ కూటమికి ఉందని చెప్పారు. జనాలు కూటమితో ఉన్నారని, అం దుకే బీజేపీ దేవుడి పేరును ఎత్తుకుందన్నారు.