
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శిస్తుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. సకాలంలో రైతు బంధు చెక్కులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రైతుబంధు చెక్కులను తక్షణమే విడుదల చేయాలని.. లేకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బ్యాంకులు రుణాలివ్వకపోవడం,రైతుబంధు చెక్కులివ్వకపోవడంతో రైతులు అప్పులపాలవుతున్నారని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి మాట నిలబెట్టుకోవాలని సూచించారు. లాభాలు వచ్చే రూట్లలో అద్దె బస్సులు నడుపుతూ… నష్టాలు వచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సిద్దమవుతున్న పట్టించుకోకుండా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ నిద్రమత్తును వీడి యూనియన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.