కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్​ శక్తులకు కొమ్ము కాస్తోంది : రామకృష్ణ

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్​ శక్తులకు కొమ్ము కాస్తోంది : రామకృష్ణ

కామారెడ్డి టౌన్, వెలుగు: డబ్ల్యూటీవో నుంచి భారత్​వైదొలగాలని సీపీఐఎంల్(ప్రజాపంథా) కామారెడ్డి జిల్లా సెక్రెటరీ రామకృష్ణ డిమాండ్​చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం కామారెడ్డి జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.  రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్​ సంస్థలకు కొమ్ము కాస్తూ, పేద ప్రజలను అన్యాయం చేస్తుందన్నారు.

10 ఏండ్ల పాటు దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ, పేదలకు చేసిందేమీ లేదన్నారు. ప్రతిఒక్కరి అకౌంట్​లో రూ.10 లక్షలు వేస్తామని, యువతకు కోట్లల్లో ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఐఎఫ్​టీయూ జిల్లా సెక్రెటరీ ప్రకాశ్, ఏఐకేఎస్​జిల్లా ప్రెసిడెంట్​పరమేశ్, ఐఎఫ్​టీయూ జిల్లా ప్రెసిడెంట్​బాల్​రాజు, పీడీఎస్​యూ జిల్లా ప్రెసిడెంట్​ సురేశ్​పాల్గొన్నారు.

ALSO READ : కాంగ్రెస్ గూటికి ఆర్మూర్​ మున్సిపల్ వైస్​ చైర్మన్, కౌన్సిలర్లు