కాంగ్రెస్ గూటికి ఆర్మూర్​ మున్సిపల్ వైస్​ చైర్మన్, కౌన్సిలర్లు

కాంగ్రెస్ గూటికి ఆర్మూర్​ మున్సిపల్ వైస్​ చైర్మన్, కౌన్సిలర్లు
  •     ఉమ్మడి జిల్లాలోనూ పలు చోట్ల ముమ్మరంగా చేరికలు 

ఆర్మూర్​, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్​మున్నాతో పాటు 16 మంది కౌన్సిలర్లు సోమవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్​పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు బోధన్ కు వెళ్లి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. 

కాంగ్రెస్​గూటికి చేరిన కౌన్సిలర్లలో ఖాందేష్ సంగీత, వన్నెల్ దేవి లావణ్య, మేడిదాల సంగీత, ఇట్టెడి నర్సారెడ్డి, బండారి ప్రసాద్, కొనపత్రి కవిత, లిక్కి శంకర్, ఇంతియాజ్, ఆకుల రాము, వనం శేఖర్, సుంకరి ఈశ్వరి, ఆయేషా శిరిన్, పుత్లి బేగం, నజ్వీన్​సుల్తాన్ అతిక్, కొంతం మంజుల ఉన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ స్టేట్​లీడర్​గడుగు గంగాధర్, నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ యాల్ల సాయిరెడ్డి, పుట్టింటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ టౌన్ ప్రెసిడెంట్​ సాయిబాబా గౌడ్, గడ్డం మారుతి రెడ్డి, బాబా ఖాన్, గిరి, కోలా వెంకటేశ్, అజ్జు,  ఫయిమ్ తదితరులు ఉన్నారు.
 

బోధన్: బోధన్​మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్​కౌన్సిలర్​ దూల్​పాల్​ సోమవారం ఎమ్మెల్యే పి.సుదర్శన్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​కండువా కప్పుకున్నారు. దూల్​పాల్​ మాట్లాడుతూ..  సీఎం రేవంత్​రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడినై కాంగ్రెస్​లో చేరుతున్నానన్నారు.
 

వర్ని: బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​కు గట్టి షాక్​ తగిలింది. రుద్రూర్​మండలానికి చెందిన 200 మంది బీఆర్ఎస్​ కార్యకర్తలు సోమవారం గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్​ గూటికి చేరుకున్నారు. రుద్రూర్‌ లోని శశిరేఖ ఫంక్షన్‌‌ హాల్‌‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​చార్జి ఏనుగు రవీందర్​రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రోగ్రామ్​లో రుద్రూర్‌‌ మండలాధ్యక్షుడు తోట అరుణ్‌‌, రుద్రూర్‌‌ మాజీ సర్పంచ్‌‌ ఇందూరు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం : షబ్బీర్​అలీ

భిక్కనూరు: భిక్కనూరు మండలానికి చెందిన వివిధ పార్టీల లీడర్లు సోమవారం కాంగ్రెస్​ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మెదక్​ జిల్లా రామాయంపేట్​లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలా మంది పార్టీలో చేరుతున్నారన్నారు. అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలు అందుతాయన్నారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్​రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు భీమ్​రెడ్డి, జిల్లా ఉపాధ్యాక్షుడు మద్ది చంద్రకాంత్​రెడ్డి, ఏఐఆర్​సెల్​జిల్లా అధ్యక్షుడు చిట్టెడి సుధాకర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.