
- సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
మధిర, వెలుగు: మధిరలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధిర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ మూడేండ్ల కింద మధిరలో రూ.60 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆస్పత్రిని వృథాగా పెట్టడం సరికాదన్నారు.
సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, పట్టణ కార్యదర్శి పడకంటి మురళి, మండల కార్యదర్శి మంద సైదులు , నాయకులు తేలబ్రోలు రాధాకృష్ణ ,పెంటి వెంకటరావు, పుచ్చకాయల కిషోర్, అనుములు భాస్కరరావు, ఎర్రుపాలెం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.