సిలిండర్ ధరను తక్షణమే వాపస్ తీసుకోవాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

సిలిండర్ ధరను తక్షణమే వాపస్ తీసుకోవాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

హైదరాబాద్, వెలుగు: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పెంపు సామాన్య ప్రజల నడ్డి విరచడమేనని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రజలపై భారాలు మోపడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో ఇంధన నిల్వలకు కొరత లేదని చెబుతూనే.. మరోవైపు ధరలు పెంచి ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని విమర్శించారు.

అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే కేంద్రం పనిగా పెట్టుకుందని విమర్శించారు. పెరిగిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల బాధ్యతారాహిత్యం వల్లే నీట్ విద్యార్థిని ఇందు మృతి చెందిందని ఆరోపించారు. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన విద్యార్థిని శవంగా మారడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు.