కామన్వెల్త్ క్రీడల్లో మెన్స్‌‌ లాంగ్‌‌ జంప్‌‌లో ఫైనల్స్‌‌కు శ్రీశంకర్‌‌

కామన్వెల్త్ క్రీడల్లో మెన్స్‌‌ లాంగ్‌‌ జంప్‌‌లో ఫైనల్స్‌‌కు శ్రీశంకర్‌‌

గ్లాస్గో: ఇండియా స్టార్‌‌ అథ్లెట్‌‌ మురళీ శ్రీశంకర్‌ మెన్స్‌‌ లాంగ్‌‌ జంప్‌‌లో ఫైనల్స్‌‌కు అర్హత సాధించాడు. గ్రూప్‌‌–ఎలో పోటీపడిన శ్రీశంకర్‌‌ తొలి ప్రయత్నంలోనే 8.01 మీటర్ల దూరం దూకి డైరెక్ట్‌‌గా ఫైనల్‌‌ బెర్త్‌‌ను ఖాయం చేసుకున్నాడు. ఈ గ్రూప్‌‌ నుంచి నేరుగా అర్హత సాధించిన ఏకైక అథ్లెట్‌‌ శ్రీశంకర్‌‌ కావడం విశేషం. 2022 క్రీడల్లో సిల్వర్‌‌ సాధించిన శ్రీశంకర్‌‌ ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. 

గ్రూప్‌‌–బిలో పోటీపడిన లోకేశ్‌‌ సత్యనాథన్‌‌ తొలి ప్రయత్నంలో 7.77 మీటర్ల దూరం దూకి నాలుగో స్థానంలో నిలిచాడు. బెస్ట్‌‌ టైమింగ్‌‌ ఆధారంగా ఫైనల్స్‌‌కు చేరాడు. మెన్స్‌‌ 110 మీటర్ల హర్డిల్స్‌‌లో తేజస్‌‌ శిర్సే చరిత్ర సృష్టించాడు. హీట్‌‌–1లో బరిలోకి దిగిన తేజస్‌‌13.76 సెకన్ల టైమింగ్‌‌తో మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌‌కు అర్హత సాధించాడు. దాంతో క్రీడల్లో టైటిల్‌‌ పోరుకు చేరిన తొలి ఇండియన్‌‌ అథ్లెట్‌‌గా రికార్డులకెక్కాడు.